Loading...
50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం.. ఏకంగా 50 ఓటీటీ యాప్‌లు బ్లాక్!
అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం.. ఏకంగా 50 ఓటీటీ యాప్‌లు బ్లాక్!

50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం.. ఏకంగా 50 ఓటీటీ యాప్‌లు బ్లాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఓటిటి (OTT) ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. వినియోగదారులకు అసభ్యకరమైన కంటెంట్‌ను అందిస్తున్నట్లు గుర్తించిన 50 ఓటీటీ యాప్‌లపై దేశవ్యాప్తంగా యాక్సెస్‌ను నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది 25 ఓటీటీ యాప్‌లపై, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 5 యాప్‌లపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో 50 యాప్‌లను బ్లాక్ చేయడం గమనార్హం.

వివరాలు 

లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందునే ఈ 50 xsఓటీటీ యాప్‌లపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, చట్టాలను ఉల్లంఘించే యాప్‌లు లేదా సేవలపై అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏ చట్టాల ప్రకారం చర్యలు?

ఈ యాప్‌లపై సమాచార సాంకేతిక (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

వివరాలు 

అధికారుల పరిశీలనలో ఆయా ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్

భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 294 నిబంధనలను ఉల్లంఘించడం,

మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని సెక్షన్ 4కు విరుద్ధంగా ఉండటం వంటి అంశాలు గుర్తించినట్లు పేర్కొంది.

దీంతో ఈ యాప్‌లకు దేశవ్యాప్తంగా యాక్సెస్‌ను నిరోధించాలని నిర్ణయించింది.

50 యాప్‌ల పేర్లు వెల్లడించలేదు

ప్రస్తుతం నిషేధానికి గురైన 50 ఓటీటీ యాప్‌ల పేర్లను ప్రభుత్వం వెల్లడించలేదు.

అయితే చట్టవిరుద్ధమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేసే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

సోషల్ మీడియా, డిజిటల్ మధ్యవర్తులకు కొత్త నిబంధనలు

ఇటీవల సవరించిన ఐటీ నిబంధనల ప్రకారం... కోర్టు ఆదేశం లేదా ప్రభుత్వ నోటీసు అందిన మూడు గంటల్లోపే సోషల్ మీడియా సంస్థలు, ఇతర డిజిటల్ మధ్యవర్తులు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలి.

అవసరమైతే ఆ కంటెంట్‌కు యాక్సెస్‌ను కూడా వెంటనే నిరోధించాలి. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

గూగుల్, యాపిల్‌కు కూడా కేంద్రం ఆదేశాలు

నిషేధిత యాప్‌లను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉండేందుకు...

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) ఆయా యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని, Google Play Store, Apple App Store నుంచి కూడా ఆ యాప్‌లను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంది?

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాప్‌లలో ప్రసారం అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర వీడియోలు అశ్లీల స్వభావం కలిగి ఉన్నట్లు గుర్తించారు.

ట్రాఫిక్ పెంచుకోవడం, సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా అధిక ఆదాయం పొందడం కోసం అసభ్యకర కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తేలడంతోనే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ADVERTISEMENT