Chari 111: వెన్నెల కిషోర్ నటించిన 'చారి 111' థీమ్ సాంగ్ విడుదల
తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ "చారి 111"లో గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు. సినిమా ట్రైలర్ వినోదాత్మక కంటెంట్‌తో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పుడు, మేకర్స్ దాని థీమ్ సాంగ్‌ను ఆవిష్కరించారు. "ఆపరేషన్ రుద్రనేత్ర" అంటూ సాగిన ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రచించారు. 'జవాన్' ఫేమ్ సంజీత భట్టాచార్య ఈ పాటను పాడారు.ఈ సినిమాకి సైమన్ కె కింగ్ సంగీత దర్శకత్వం వహించారు. స్టైలిష్‌గా డిజైన్ చేసిన లిరికల్ వీడియో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ సరసన హీరోయిన్ గా సంయుక్త విశ్వనాథన్ నటిస్తోంది. అదితి సోని నిర్మించి,TG కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1, 2024న విడుదల కానుంది.