LOADING...
Spirit : స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌తో నటించే అరుదైన అవకాశం.. ఇలా అప్లై చేయండి! 
స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌తో నటించే అరుదైన అవకాశం.. ఇలా అప్లై చేయండి!

Spirit : స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌తో నటించే అరుదైన అవకాశం.. ఇలా అప్లై చేయండి! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత దీపిక పదుకొణెను హీరోయిన్‌గా భావించినప్పటికీ, ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీను ఎంపిక చేశాడు దర్శకుడు సందీప్. ఎన్నో రోజులుగా ఈ చిత్ర షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో ఒక బంపర్ ఛాన్స్ ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.

వివరాలు 

13 నుండి 17 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన బాలురు/యువకులు

'స్పిరిట్‌' కోసం నటులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. తాజాగా చిత్ర బృందం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 13 నుండి 17 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన బాలురు/యువకులు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు తమ మూడు ఫోటోలు, రెండు నిమిషాల యాక్టింగ్ వీడియో, డీటేయిల్స్ ను spirit.bhadrakalipictures@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపించాలని కోరారు. అంతేకాకుండా, 7075770364 అనే ఫోన్ నంబర్‌కు కాల్ చేయవచ్చని కూడా తెలిపారు. ఇంత పెద్ద స్టార్ ఉన్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ప్రతి ఒక్కరికీ రాదు. పైగా ప్రభాస్ వంటి స్టార్‌తో కలిసి నటించే ఛాన్స్,ఎంత మంది కలలలోనైనా ఉంటుంది.

వివరాలు 

పాత్ర కోసం విధివిధానాలు 

అందువల్ల ఈ అవకాశాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అయితే, ఈ పాత్ర కోసం షార్ట్ హెయిర్‌స్టైల్‌ (చిన్న జుట్టు లుక్) ఉండాల్సి ఉంటుందని, ఈ లుక్‌ ప్రభాస్‌ బాల్య దశను ప్రతిబింబించేలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర బృందం చాలామంది నటులను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ యంగ్ మేల్ రోల్ కోసం ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే.. ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భద్రకాళి పిక్చర్స్ చేసిన ట్వీట్