NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Chandini Chaudhary: నేడు యంగ్ బ్యూటీ చాందిని చౌదరి బర్త్ డే.. సంతాన ప్రాప్తిరస్తు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
    తదుపరి వార్తా కథనం
    Chandini Chaudhary: నేడు యంగ్ బ్యూటీ చాందిని చౌదరి బర్త్ డే.. సంతాన ప్రాప్తిరస్తు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
    సంతాన ప్రాప్తిరస్తు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్

    Chandini Chaudhary: నేడు యంగ్ బ్యూటీ చాందిని చౌదరి బర్త్ డే.. సంతాన ప్రాప్తిరస్తు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    12:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు".

    ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ కింద మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    "ఏబీసీడీ" మూవీ, "అహ నా పెళ్లంట" వెబ్ సిరీస్‌లను రూపొందించిన యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

    ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో కలిసి తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాంటీ డ్రగ్స్ ప్రకటన రూపొందించి ప్రశంసలు పొందారు.

    వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఏక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జీ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తున్నారు.

    వివరాలు 

    కల్యాణి ఓరుగంటి పాత్రలో చాందినీ చౌదరి

    మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా నేటి రోజున చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

    "సంతాన ప్రాప్తిరస్తు"లో చాందినీ చౌదరి కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు.

    ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన జీవిత భాగస్వామిగా కోరుకుంటున్న కల్యాణి,సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు దూరంగా ఉండాలని భావిస్తోంది.

    ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య,అంటే సంతానలేమిని ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించబోతున్నారు.

    ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.ఈ చిత్రంలో వెన్నెల కిషోర్,శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం,మురళీధర్ గౌడ్,హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, అనిల్ గిలా, కిరీటి, సద్దాం తదితరులు నటిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ 

    #HeroineChandini Chowdary's First Look from Musical Family Entertainer Santhana Prapthirasthu Unveiled on Her Birthday* pic.twitter.com/T441JpZrH1

    — 24 studio official (@24studio4) October 23, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫస్ట్ లుక్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    ఫస్ట్ లుక్

    టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు  తెలుగు సినిమా
    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్  రవితేజ
    పెదకాపు-1 ఫస్ట్ లుక్: ఆసక్తి రేపుతున్న సామాన్యుడి సంతకం  తెలుగు సినిమా
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025