
Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (Chandra mohan) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.
అయితే ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్‌తో తనకున్న అనుబంధాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
చంద్రమోహన్ ఇక లేరని చెప్పడం ఎంతో విషాదకరమైన వార్త అన్నారు. తన నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటనను చంద్రమోహన్ ప్రదర్శించినట్లు చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మెగాస్టార్ అన్నారు.
చంద్రమోహన్
కేసీఆర్, వైఎస్ జగన్, బాలకృష్ణ సంతాపం
చంద్రమోహన్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు. చంద్రమోహన్ లేని లోటు తెలుగు చిత్రసీమకు తీరని లోటు అని కేసీఆర్ అన్నారు.
చంద్రమోహన్ తెలుగుతో పాటు అనేక భాషల్లో లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారన్నారు.
చంద్రమోహన్ కన్ను మూయడం బాధాకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు.
అలాగే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా చంద్రమోహన్ మృతికి సంతాపం ప్రకటించారు. పౌరాణిక, కుటుంబ చిత్రాలతో ఆయన అలరించారన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెగాస్టార్ ట్వీట్
'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023
నా తొలి చిత్రం 'ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నందమూరి బాలకృష్ణ ట్వీట్
జీవితం క్షణికం, జీవం పోసిన పాత్రలు శాశ్వతం, అలాంటి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన మన అలనాటి అభిమాన నటుడు చంద్రమోహన్ గారు ఇక లేరు.#Chandramohan#OmShanti pic.twitter.com/bRkBKw3KdO
— Nandamuri Balakrishna (@NBK_Unofficial) November 11, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాని ట్వీట్
Chandra Mohan gaaru.
— Nani (@NameisNani) November 11, 2023
One of the most relatable actors and big part of my childhood films 💔🙏🏼
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీనియర్ హీరో వెంకటేశ్ నివాళి
Deeply saddened by the news of Chandra Mohan garu's passing. Sending thoughts of comfort and strength to his near and dear ones during this difficult time. May his soul rest peacefully. pic.twitter.com/H3Xg3NFDWn
— Venkatesh Daggubati (@VenkyMama) November 11, 2023