
చంద్రముఖి 2: కంగనా రనౌత్ నవరసాలు పలికిస్తున్న వీడియో చూసారా?
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల అవుతుంది.
విడుదలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో చంద్రముఖి 2 చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టింది. తాజాగా ఈ సినిమా నుండి కంగనా రనౌత్ నవరస వీడియోను రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో నవరసాలైన శృంగారం, బీభత్సం, భయానకం, కరుణ, రౌద్రం, హాస్యం, వీరం, భీభత్సం, అద్భుతం రసాలను తన హావాభావాల్లో పలికించింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
Details
చంద్రముఖి 2 సినిమాకు సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డ్ గ్రహీత
రజనీకాంత్, జ్యోతిక, నయనతార నటించిన చంద్రముఖి(2005) సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చంద్రముఖి 2 సినిమాపై అంచనాలు పెద్ద ఎత్తులో ఉన్నాయి.
చంద్రముఖి సినిమాను తెరకెక్కించిన పి వాసు చంద్రముఖి 2 సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, వడివేలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కంగనా రనౌత్ నవరసాలు పలికించిన వీడియో
How is Kangana Ranaut's Navarasa?
— Manobala Vijayabalan (@ManobalaV) August 27, 2023
||#KanganaRanaut |#ChandraMukhi2||pic.twitter.com/H4y1TewCek