NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చంద్రముఖి 2 షూటింగ్ పూర్తి: సినిమా రిలీజ్ ఎప్పుడంటే? 
    తదుపరి వార్తా కథనం
    చంద్రముఖి 2 షూటింగ్ పూర్తి: సినిమా రిలీజ్ ఎప్పుడంటే? 
    చంద్రముఖి 2 షూటింపై రాధికా శరత్ కుమార్ పంచుకున్న అప్డేట్

    చంద్రముఖి 2 షూటింగ్ పూర్తి: సినిమా రిలీజ్ ఎప్పుడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 30, 2023
    01:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. 2005లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, ప్రేక్షకులను భయపెట్టి విపరీతమైన కలెక్షన్లు అందుకుంది.

    అయితే ప్రస్తుతం 17సంవత్సరాల తర్వాత చంద్రముఖి 2 రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం, చంద్రముఖి 2 సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

    ఈ మేరకు రాధికా శరత్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చంద్రముఖి 2 షూటింగ్ పూర్తయ్యిందనీ, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నటించడం సంతోషంగా ఉందనీ, ఈ సినిమాను దర్శకుడు పి వాసు అద్భుతంగా తెరకెక్కించాడని పేర్కొంది.

    అంతేకాదు, ఇందులో హీరోగా కనిపిస్తున్న లారెన్స్ తనకు గోల్డ్ రింగ్, ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాడని చెప్పుకొచ్చింది.

    Details

    ప్రధాన పాత్రలో కంగనా రనౌత్ 

    నిజానికి చంద్రముఖి సినిమా హిట్ అయినపుడు రజనీ కాంత్ తో చంద్రముఖి సీక్వెల్ తీయాలని దర్శకుడు పి వాసు అనుకున్నారు. కానీ అనేక కారణాల వల్ల ఇది కుదరలేదు.

    ఇప్పుడు తెరకెక్కిన చంద్రముఖి సీక్వెల్ లో కంగనా రనౌత్, రాధికా శరత్ కుమార్, వడివేలు నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్రబృందం అనుకుంటున్నట్లు సమాచారం.

    సాధారణంగా సీక్వెల్ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య సీక్వెల్ సినిమాలే ట్రెండ్ సృష్టిస్తున్నాయి. మరి చంద్రముఖి స్థాయి విజయాన్ని చంద్రముఖి 2 కూడా అందుకుంటుందేమో చూడాలి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చంద్రముఖి 2 సినిమాపై రాధికా శరత్ కుమార్ ట్వీట్ 

    It’s a wrap #chandramukhi2 @LycaProductions wht a joy working with a director so thorough with his craft and vision #pvasu 🙏 and thank you to this gem @offl_Lawrence who is the first hero who gifted me a gold ring and expensive watch, genuine affection ❤️❤️❤️❤️ pic.twitter.com/9WlBRBuKqH

    — Radikaa Sarathkumar (@realradikaa) May 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ? పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    #NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి? డీఆర్జీ దళాలు
    Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు విరాట్ కోహ్లీ

    సినిమా

    ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు  బాలీవుడ్
    ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్: సీత కళ్ళలో కన్నీరు  సినిమా
    దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు  తెలుగు సినిమా
    ఈ వారం సినిమా: థియేటర్లలో సందడి చేయనున్న ఈ వారం సినిమాలు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025