LOADING...
Keerthy Suresh : 'మార్పు అవసరం'.. ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై కీర్తి సురేష్ అసంతృప్తి 
'మార్పు అవసరం'.. ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై కీర్తి సురేష్ అసంతృప్తి

Keerthy Suresh : 'మార్పు అవసరం'.. ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై కీర్తి సురేష్ అసంతృప్తి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్‌పై చర్చ రోజురోజుకు వేడెక్కుతున్న వేళ, హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్', కల్కి 2898 ఏడి సీక్వెల్ వంటి భారీ ప్రాజెక్టుల నుంచి దీపికా పడుకోన్ వైదొలగడం ఈ చర్చకు మరింత ఊపునిచ్చింది. ముఖ్యంగా పని గంటల ఒత్తిడే ఆమె తప్పుకునేందుకు కారణమన్న వార్తలు ఇండస్ట్రీని కుదిపేశాయి. దీంతో రోజుకు '8 గంటల షూటింగ్' అనే షరతు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ తన అనుభవాలను ఓపెన్‌గా పంచుకున్నారు.

Details

ఏ షెడ్యూల్‌కైనా అలవాటు పడతా 

కీర్తి మాట్లాడుతూ... ఏ షెడ్యూల్‌కైనా తాను అలవాటు పడగలనని, మహానటి సినిమా సమయంలో ఒకే రోజులో మూడు వేర్వేరు సినిమాల సెట్లకు వెళ్లి షూట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పింది. ఉదయం ఒక సినిమా, మధ్యాహ్నం మరొకటి, సాయంత్రం మూడో సినిమా... ఇలా అన్నింటిని సమతుల్యం చేశా. కానీ ఇది ప్రతి నటుడు చేయలేడు. వాళ్ల పరిస్థితులు, సామర్థ్యాలు వేరని ఆమె స్పష్టం చేశారు. 9 నుండి 6 వరకు జరిగే రెగ్యులర్ షిఫ్ట్ గురించిన వివరాల్లోకి వెళ్లిన కీర్తి... 9 గంటలకు షూట్ ఉంటే 7:30కి సెట్లో ఉండాలి. అంటే 5:30కల్లా నిద్రలేవాల్సిందే.

Details

 6 గంటలు కూడా నిద్రపోవడం లేదు

సాయంత్రం 6:30కి షూట్ అయిపోయినా మేకప్ తీయడం, కాస్ట్యూమ్ మార్చడం, ఇంటికి చేరడం... ఇవన్నీ కలిపితే రాత్రి 10:30 అవుతుంది. తర్వాత జిమ్ కూడా చేయాలి. ఇలా చూస్తే నటులు రోజుకు 6 గంటల నిద్ర కూడా సరిగ్గా పడటం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. టెక్నీషియన్ల కష్టాల గురించి కూడా ఆమె స్పష్టంగా చెప్పింది. నటులు ఆలస్యంగా వచ్చి ముందే వెళ్లిపోతారు. కానీ లైట్, కెమెరా, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ టెక్నీషియన్లు మాకన్నా ముందే వచ్చి చివరిలోనే సెట్లో నుంచి బయలుదేరుతారు. వారి పని గంటలు మరింత కఠినంగా ఉంటాయని వివరించింది.

Details

12 గంటల షిఫ్ట్ లు కొనసాగుతున్నాయి

టాలీవుడ్, కోలీవుడ్‌లలో 9-6 షిఫ్ట్ పద్ధతి పెరుగుతున్నప్పటికీ, మాలీవుడ్, బాలీవుడ్‌లో ఇంకా 12 గంటల షిఫ్ట్‌లు కొనసాగుతున్నాయని పేర్కొంది. మాలీవుడ్ అయితే బ్రేక్ లేకుండా పని చేసే పరిస్థితుల్లో లైట్‌మ్యాన్‌లకు రోజుకి 3-4 గంటల నిద్రే దొరుకుతుందని కీర్తి ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి, సినీ ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్‌పై జరుగుతున్న చర్చ మధ్యలో కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు నటీనటులతో పాటు టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను స్పష్టంగా బయటపెట్టాయి.