LOADING...
Mega 158 : బాబీ కథలో మార్పులు.. మెగాస్టార్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్డేట్
బాబీ కథలో మార్పులు.. మెగాస్టార్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్డేట్

Mega 158 : బాబీ కథలో మార్పులు.. మెగాస్టార్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్డేట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చిత్ర యూనిట్ పూర్తి ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే నిన్న తిరుపతిలో ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఇక జనవరి 7న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Details

 పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం

ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో ప్రారంభించనున్నట్టు సమాచారం. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన బాబీ, ఈసారి అంతకుమించిన విజయం సాధించాలనే లక్ష్యంతో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమాతో కూడా బ్లాక్‌బస్టర్ అందుకున్న బాబీ, ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో మాసివ్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే తాజాగా కథలో మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Details

నూతన కథతో ముందుకెళ్లాలని ప్లాన్

మొదట అనుకున్న కథ ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, దానికి దగ్గరైన కథతో ఇటీవలే ఓ సినిమా రావడంతో కొత్త కథతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. అయినప్పటికీ మెగాస్టార్‌తో బాబీ ప్లానింగ్ మాత్రం మరింత పక్కాగా సాగుతున్నట్టు టాక్. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement