LOADING...
Lokah Chapter 1: రికార్డుల వేటలో లోక చాప్టర్ 1.. కలెక్షన్స్‌లో అరుదైన ఫీట్!
రికార్డుల వేటలో లోక చాప్టర్ 1.. కలెక్షన్స్‌లో అరుదైన ఫీట్!

Lokah Chapter 1: రికార్డుల వేటలో లోక చాప్టర్ 1.. కలెక్షన్స్‌లో అరుదైన ఫీట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమాల్లో 'కొత్త లోక చాప్టర్ 1 - చంద్ర' ఒకటిగా నిలిచింది. మాలీవుడ్ నుంచి మొట్టమొదటి ఫీ మేల్ సూపర్ హీరో సినిమాగా వచ్చిన ఈ చిత్రం, ఫస్ట్ డే నుంచి వార్తల్లో నిలిచే అప్‌డేట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చెన్నై భామ కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ లీడ్ రోల్స్‌లో నటించారు. టోవినో థామ్స్, ఇతర అతిథి పాత్రలలో కనిపించగా, ఆగస్టు 28న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌పై ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. రూ.35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన చంద్ర, కేరళలో కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తూ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

Details

ఐదు పార్ట్ లుగా 'లోక' సిరీస్

ఇదే కారణంగా సినిమా 300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించి, మలయాళ సినిమాలో ఇప్పటివరకు సాధించని అరుదైన ఫీట్ సాధించింది. సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్‌తో చంద్ర కేరళతో పాటు, ఇండియా, ఓవర్సీస్‌లో రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో అత్యధిక గ్రాస్ సాధించిన మలయాళ సినిమాగా, కేరళలో హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమా‌గా రికార్డులు సృష్టించింది. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో డొమినిక్ అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం, 'లోక' సిరీస్ మొత్తం 5 పార్టులుగా రూపొందించారు. ఇవన్నీ ఫస్ట్ పార్ట్ షూటింగ్‌కు ముందే రెడీగా ఉన్నాయి. అంతేకాదు మొత్తం సిరీస్‌లో ఎవరు విలన్‌ అనేది 'చంద్ర' ఓపెనింగ్ సీన్‌లో హింట్ ఇచ్చామని డైరెక్టర్ వెల్లడించాడు.