RC 16 : బూత్ బంగ్లాలో బుచ్చిబాబు'RC 16' షూటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం RC16.
'ఉప్పెన' చిత్రంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంతో కొనసాగుతోంది.
రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమా కావడంతో, ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత సినిమా గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో, ఈ చిత్రం ఆ లోటును భర్తీ చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.
అలాగే, రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు.
వివరాలు
కీలక సన్నివేశాల్లో కన్నడ స్టార్ హీరో
ఈ నేపథ్యంలో, చిత్రబృందం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది.
వచ్చే ఆగస్టు నెలలోపే చిత్రీకరణను పూర్తి చేసేందుకు స్పష్టమైన షెడ్యూల్‌ను సిద్ధం చేసిందట చిత్ర యూనిట్.
కొద్ది రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీం, ఇటీవలే మళ్లీ పటిష్టంగా పనులు ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని భూత్ బంగ్లా వద్ద చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారు.
అంతేకాకుండా, ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఇంకా పలువురు సీనియర్ నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
వివరాలు
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎపిసోడ్
ఈ సినిమా కథలో కీలకంగా నిలిచే క్రికెట్ మ్యాచ్ సన్నివేశాలు, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎపిసోడ్ లాంటి భాగాలను దర్శకుడు బుచ్చిబాబు సన ఇప్పుడు తెరకెక్కిస్తున్నాడు.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి.