Charlie Chaplin Daughter: చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత కమెడియన్ చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫినా చాప్లిన్ కన్నుమూసారు.
74ఏళ్ల వయసులో జోసెఫినా చాప్లిన్ జులై 13వ తేదీన ప్యారిస్‌లో తుదిశ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఆమె ఎందుకు మరణించారనే విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించలేదు.
జోసెఫినా చాప్లిన్ పలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. ఆమె నటించిన చిత్రాల్లో కాంటర్ బరీ, ఎస్కేప్ టు ద సన్ చిత్రాలు చెప్పుకోదగినవి.
1949 మార్చ్ 28వ తేదీన చార్లీ చాప్లిన్, అతని నాలుగో భార్యకు మూడో సంతానంగా జోసెఫినా చాప్లిన్ జన్మించారు. చార్లీ చాప్లిన్ నాలుగో భార్యకు ఎనిమిది మంది సంతానం.
Details
జోసెఫినా చాప్లిన్ వ్యక్తిగత జీవితం
బాల్యంలోనే చార్లీ చాప్లిన్‌తో లైమ్ లైట్ అనే సినిమాలో జోసెఫినా నటించారు.. ఇది 1952లో విడుదలైంది. ఆ తర్వాత ది కౌంటీస్ ఫ్రమ్ హాంకాంగ్ అనే సినిమాలో చార్లీ చాప్లిన్‌తో పాటు మరోసారి కనిపించారు.
కెరీర్ తొలిదశలో చార్లీ చాప్లిన్ ఆఫీసు పనులను జోసెఫినా చూసుకునేవారు. 1969లో గ్రీక్ బిజినెస్ మెన్ ని జోసెఫినా పెళ్లి చేసుకున్నారు. కానీ 1977లో అతనికి విడాకులు ఇచ్చారు.
ఆ తర్వాత ఫ్రెంఛ్ నటుడు మారిస్ రోనెట్ తో అతను మరణించే వరకు(1983 వరకు) కలిసి సహజీవనం చేశారు.
1989లో ఆర్కియాలజిస్ట్ జీన్ క్లాడ్ గార్డిన్‌ని వివాహం చేసుకున్నారు. 2013లో జీన్ క్లాడ్ మరణించారు. వీరిద్దరికీ ముగ్గురు కుమారులు ఉన్నారు.