Page Loader
Chef Mantra Project K: ఆహా ఓటిటిలో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K'.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్దమైన సుమ

Chef Mantra Project K: ఆహా ఓటిటిలో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K'.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్దమైన సుమ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టెలివిజన్ రంగంలో హోస్ట్, నిర్మాత, నటిగా అనేక భిన్న పాత్రల్లో ఆమె రెండు దశాబ్దాలకుపైగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఓటీటీలోకి కొత్తగా అడుగుపెడుతూ, ప్రేక్షకులను మరో మారు అలరించనున్నారు. సుమ ఓటీటీలో వంటల ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనుండగా, ఇందులో రుచికరమైన వంటలను పరిచయం చేయనున్నారు. ఈ షోలో ఐదు జోడీలు పాల్గొంటారు. త్వరలోనే "చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K" స్ట్రీమింగ్‌కు రానుందని ఆహా అధికారికంగా ప్రకటించింది. దీంతో, ఈ షో ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వివరాలు 

ఇక్క‌డ‌ కుకింగ్, కామెడీ, ట్విస్ట్స్ అన్ని మ‌సాలాలు ఉంటాయ్‌..

తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీ మరింత చేరువైంది. వైవిధ్యమైన, కుటుంబంతో కలిసి చూసేలా ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తాజాగా "చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K" అనే కొత్త ప్రోగ్రామ్‌తో వినూత్న వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. "ఇది కేవలం కుకింగ్ షో కాదు! వంటలతో పాటు కామెడీ, ట్విస్టులు, మరియు పూర్తి వినోదాన్ని అందించే 'అల్టిమేట్ కుకింగ్ ఎంటర్‌టైన్‌మెంట్'!" అని ఆహా ప్రకటించింది. అందువల్ల, రుచికరమైన వంటల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి!

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆహా చేసిన ట్వీట్