LOADING...
Peddi: భారతీయ సినిమా చరిత్రలోనే 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు
భారతీయ సినిమా చరిత్రలోనే 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు

Peddi: భారతీయ సినిమా చరిత్రలోనే 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి తొలి పాట విడుదలైంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల భాగంగా చిత్రబృందం తాజాగా విడుదల చేసిన 'చికిరి చికిరి' పాట సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించి ఇండియన్‌ సినిమా చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పింది. వివరాల్లోకి వెళ్తే - 'చికిరి చికిరి' పాట విడుదలైన 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. అంతకుముందు 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్‌ సాధించిన పాటల రికార్డులను ఇది బద్దలుకొట్టింది.

Details

13 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్

కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్ సాధించడం ఈ పాట ప్రత్యేకత. దీని ఫలితంగా 'చికిరి చికిరి' యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన తొలి భారతీయ సాంగ్‌గా నిలిచింది. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించగా, గాయకుడు మోహిత్‌ చౌహాన్‌ ఆలపించారు. సాహిత్యం బాలాజీ రాశారు. జానీ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించిన ఈ పాటలో రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ల జోడి స్క్రీన్‌పైన మాయచేసింది. రెహమాన్‌ సంగీతంలో జానపద తాళాలు, ఆధునిక బీట్స్‌ సమ్మిళితమై ఉండటంతో పాటకు కొత్త ఉత్సాహం లభించింది. రామ్‌చరణ్‌ ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌, జాన్వీ కపూర్‌ గ్రేస్‌, రంగుల మేళవింపు కలగలిపి ఈ సాంగ్‌ను ఫుల్‌ ఫ్యామిలీ ఫెస్టివ్‌ నంబర్‌గా మార్చేశాయి. సోషల్‌ మీడియాలో #ChikiriChikiri హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది