Chinmayi : తప్పుచేసి సమర్థించుకునే ప్రయత్నం.. జానీ మాస్టర్‌పై మళ్లీ విరుచుకుపడ్డ చిన్మయి!
ఈ వార్తాకథనం ఏంటి
కొంతకాలంగా సినీ రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులపై స్వరమెత్తుతూ వస్తున్న గాయని చిన్మయి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్దవారైనా, తనకు పరిచయం ఉన్న వారైనా ఎవరిపైనా వెనుకాడకుండా మాట్లాడే చిన్మయి, ఈసారి మళ్లీ డాన్స్ మాస్టర్ జానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతేడాది ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల సమయంలో బాధితురాలికి న్యాయం జరగాలని, జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆమె, తాజాగా మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావించారు. "ఒక పెద్దవాడు మైనర్‌తో సంబంధం పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పో గుర్తించాలంటూ చిన్మయి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
Details
అతన్ని హీరోలా చూసి పొగుడుతారు
"నేను ఈ విషయం మాట్లాడినప్పుడల్లా ఆయన భార్య ఫోన్ చేసి అలా మాట్లాడొద్దని చెబుతుంది. కానీ కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే, మళ్లీ అతనికి అవార్డులు కురుస్తాయి, అందరూ అతన్ని హీరోలా చూసి పొగుడుతారని చిన్మయి పేర్కొన్నారు. జానీ మాస్టర్ సినీ రంగంలో ఉన్న తన ప్రభావం వల్ల బాధితురాలికి న్యాయం జరగడం కష్టమవుతుందనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
Details
అమ్మాయిలను వేధించే వారు తప్పించుకున్నారు
మైనర్ అమ్మాయిలను వేధించే వారు తప్పించుకుంటున్నారని, ఇది సమాజానికి ప్రమాదకరమని ఆమె తీవ్రంగా విమర్శించారు. అయితే బాధితురాలు ధైర్యంగా నిలబడి న్యాయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం చిన్మయి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలతో మరోసారి చిన్మయి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటికే ఆమె, భర్త రాహుల్ రవీంద్రన్‌లను కొందరు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి తాజాగా పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు, జానీ మాస్టర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదం చివరికి ఏ దిశలో వెళుతుందో చూడాలి.