
Happy birthday Chiranjeevi: తెలుగు సినిమాకు బ్రాండ్ గా ఎదిగిన చిరంజీవిపై ప్రత్యేక కథనం
ఈ వార్తాకథనం ఏంటి
ఎవరైనా కొంచెం స్టయిల్ గా నడిస్తేనే, లేకపోతే కొంచెం బాగా డ్యాన్స్ వేస్తేనో ఏమిరా, నువ్వైమైనా చిరంజీవి అనుకుంటున్నావా అంటారు. తెలుగు ప్రజల మీద చిరంజీవి ప్రభావం ఎంతుందో చెప్పడానికి ఆ ఉదాహరణ చాలు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. అప్పట్లో చిరంజీవి స్టెప్పులకు కాలు కదపని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదు.
చిరంజీవి, తన కెరీర్లో ఎన్నో చిత్రాల్లు నటించారు. అందులోంచి కొన్ని చిత్రాల గురించి మాట్లాడుకుంటే మరికొన్ని మంచి చిత్రాలు గుర్తొస్తూ ఉంటాయి.
టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని చెప్పడానికి మొదటి ఉదాహరణగా, పర్వతమంత ఉదాహరణగా చిరంజీవి నిలుస్తారు.
Details
చిరంజీవి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు
ఆస్కార్ అవార్డులకు అతిథిగా మెగాస్టార్
1987లో ఆస్కార్ అవార్డ్స్ పురస్కారానికి అతిథిగా చిరంజీవికి ఆహ్వానం అందింది. దక్షిణ భారత హీరోల్లో ఆస్కార్ అవార్డ్స్ అహ్వానం అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి.
ఇంగ్లీషులో డబ్బింగ్:
చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమాను ఇంగ్లీషులో అనువాదం చేసారు.
కోటి రూపాయల పారితోషికం:
మెగాస్టార్ చిరంజీవి మొదటిసారిగా ఆపద్బాంధవుడు సినిమాకు కోటి రూపాయల పారితొషికాన్ని అందుకున్నారు. అప్పట్లో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ పారితోషికం అందుకున్న మొదటి హీరోగా చిరంజీవి నిలిచారు.
హాలీవుడ్ లో అవకాశం
1999 సంవత్సరంలో చిరంజీవికి హాలీవుడ్ లో అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు.