NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Chiranjeevi birthday special: తెర మీద సినిమా హీరో, తెర వెనుక రియల్ హీరో 
    తదుపరి వార్తా కథనం
    Chiranjeevi birthday special: తెర మీద సినిమా హీరో, తెర వెనుక రియల్ హీరో 
    చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకం

    Chiranjeevi birthday special: తెర మీద సినిమా హీరో, తెర వెనుక రియల్ హీరో 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 21, 2023
    09:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరోగా చిరంజీవి చేసిన సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తే, నిజ జీవితంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు జనాలకు ఆలంబన అందించాయి.

    ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టును చిరంజీవి స్థాపించారు. ఈ ట్రస్టు కింద చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ఉన్నాయి.

    చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రజలు సాయం పొందారు. ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రపంచాన్ని చూడగలిగారు.

    అటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి గానీ, ఇటు తన అభిమానులకు గానీ ఏ అవసరమొచ్చిన చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కరోనా సమయంలో చిరంజీవి అందించిన సాయం అందరికీ తెలిసిందే.

    Details

    గోదావరి వరద ప్రాంతాలకు చిరంజీవి సాయం 

    చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కంటే ముందుగా కూడా అనేక విరాళాలు చిరంజీవి అందించారు.

    1988లో యముడికి మొగుడు సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతుండగా అక్కడికి వచ్చిన పత్తి రైతులు, పంట నష్టం కారణంగా నష్టపోయామని మొరపెట్టుకోవడంతో అప్పటికప్పుడు 2లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చేసారు చిరంజీవి.

    అలాగే 1989లో రుద్రవీణ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డుకు వచ్చిన 30వేల రూపాయలకు మరో 20వేలు కలిపి 50వేల మొత్తాన్ని నర్గీస్ దత్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి విరాళంగా ఇచ్చారు.

    1996లో గోదావరికి వరదలు రావడంతో ఆయా ప్రాంతంలోని జనాలకు తినడానికి బియ్యం, సరుకులు మొదలగు వాటన్నింటినీ చిరంజీవి పంపించారు.

    Details

    కెమెరామెన్ దేవరాజును ఆదుకున్న చిరంజీవి 

    రీసెంట్ గా తమిళ నటుడు పొన్నంబాలం ఆరోగ్యం విషమించడంతో చిరంజీవి సాయం అందించి ఆసుపత్రి ఖర్చులు మొత్తం చిరంజీవి చూసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పొన్నం బాలం ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    తాజాగా కెమెరామెన్ దేవరాజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆయనకు 5లక్షల సాయాన్ని అందించి తన ఉదారగుణాన్ని చిరంజీవి చాటుకున్నారు.

    ఇలా చెప్పుకుంటూ పోతే వందలు, వేల కొద్ది సాయాలు వెలికి చూస్తూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, సినిమాకి అవతల కూడా జనాల్లో అంతే స్థాయిలో అభిమానాన్ని అందుకున్నారు.

    రాజకీయాల్లో సైతనం తనదైన ముద్ర వేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా దేశానికి సేవలు అందించారు చిరంజీవి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    పుట్టినరోజు
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చిరంజీవి

    తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్ తెలుగు సినిమా
    నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని ఓటిటి
    గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: నిరాశలో చిరంజీవి అభిమానులు సినిమా
    భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్ సినిమా

    పుట్టినరోజు

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి  తెలుగు సినిమా
    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ

    తెలుగు సినిమా

    సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే?  భోళాశంకర్
    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది?  ప్రభాస్
    పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక  సినిమా

    సినిమా

    ఇండస్ట్రీలో 63ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్: శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్  కమల్ హాసన్
    మీడియా సపోర్టు కోరిన హీరో శ్రీ విష్ణు   టీజర్
    'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్  రవితేజ
    శ్రీదేవి 60వ జయంతి: డూడుల్‌తో గౌరవించిన గూగుల్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025