Page Loader
ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్ 
చిరంజీవి, సత్యానంద్

ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 05, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టోరీ రైటర్, మాటలు రచయిత, స్క్రిప్ట్ డాక్టర్ ఇలా సినిమా ఇండస్ట్రీలో అనేక రంగాల్లో తన కలం పదును చూపెట్టిన ప్రఖ్యాత రచయిత సత్యానంద్, సినిమాల్లో 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సత్యానంద్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఒకానొక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. ఎన్నెన్నో విజయవంతమైన సినిమాలకు స్క్రిప్ట్, డైలాగ్స్ సమకూర్చడమే కాకుండా నేటి రచయితలకు, దర్శకులకు మెంటార్ గా ఉంటూ సినిమాని సత్యానంద్ ప్రేమిస్తున్నారని, తన చిత్రాల విజయంలో సత్యానంద్ పాత్ర ఎంతో ఉందని చిరంజీవి అన్నారు. అంతేకాదు, ఆయనలోని సినీ పరిజ్ఞానాన్ని అందరికీ పంచుతూ, మరో అర్థ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీతో సత్యానంద్ ఉండాలని చిరంజీవి పోస్ట్ పెట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిరంజీవి ట్వీట్