Megastar Chiranjeevi: చిరంజీవి పై 'X'లో వల్గర్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
తనను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న కొన్ని X (ట్విట్టర్) అకౌంట్లపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల సిటీ సివిల్ కోర్టు ఈ విషయంలో తీర్పు ఇచ్చినప్పటికీ, ఇంకా తనపై వల్గర్ కామెంట్స్, నిందలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అకౌంట్ల నిర్వాహకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది. అంతేకాక, దయా చౌదరి అనే వ్యక్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు
కొద్ది రోజుల క్రితమే తన ఫోటోలను డీప్‌ఫేక్ రూపంలో మార్చి అశ్లీల వీడియోలుగా తయారు చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దుండగులు ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై చిరంజీవి వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌ను సంప్రదించి, తరువాత కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన పేరును దెబ్బతీసేలా డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా చిరంజీవి స్పష్టంగా కోరినట్లు గుర్తుచేసుకున్నారు.