చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు 25ఏళ్ళు: ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవాకార్యక్రమాలను చిరంజీవి మొదలుపెట్టారు. 1998లో అక్టోబర్ 2వ తేదీన ఈ ట్రస్టును చిరంజీవి ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో, 25ఏళ్ళ ప్రయాణాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 25ఏళ్ళ కాలంలో 10లక్షల మందికి రక్తదానాలు, 10వేల మందికి పైగా కంటి ఆపరేషన్లు జరిగాయని చిరంజీవి అన్నారు. ఇంకా, కరోనా మహమ్మారి సమయంలో, ఎంతోమందికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అందించిందనీ అన్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరికీ చిరంజీవి దన్యవాదాలు తెలియజేసారు. అదలా ఉంచితే, చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తన కూతురు నిర్మాణంలో ఒక సినిమా చేస్తే, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు చిరంజీవి.