Page Loader
Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం 
చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం

Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 22, 2023
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల సొంత నిర్మాణ సంస్థ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ లో చిరంజీవి 156వ సినిమా ఉండబోతుంది. ఈ మేరకు సుష్మిత కొణిదెల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. 156వ సినిమా మాంచి వినోదాత్మకంగా ఉండబోతుందని సుష్మిత తెలియజేసారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. గతంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. మరి చిరంజీవి 156వ సినిమాకు కళ్యాణ్ కృష్ణను తీసుకున్నారా లేదా అనేది తెలియాలంటే మరో ప్రకటన రావాల్సిందే.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

చిరంజీవి కూతురు సుష్మిత పోస్ట్