Chiranjeevi: భార్య సురేఖపై కవిత రాసిన చిరంజీవి... సోషల్ మీడియా పోస్టు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ దాంపత్య జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం.
చిరంజీవి విజయంలో సురేఖ పాత్ర చాలా గొప్పదనే చెప్పాలి. అయితే అవకాశం వచ్చినప్పుడు చిరంజీవి తన భార్య సురేఖపై ప్రేమను కనబరుస్తూనే ఉంటారు.
ఆదివారం సురేఖ పుట్టిన రోజు కావడంతో కాస్త వెరైటీగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేశారు.
తన భార్యపై ప్రత్యేకంగా కవిత రాసి.. ఇన్‌స్టా, ట్విట్టర్ వేదికగా సురేఖకు మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు.
'నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ. హ్యపీ బర్త్‌డే'' అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా తన భార్య సురేఖతో దిగిన అందమైన ఫొటోను మెగాస్టార్ పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవి పెట్టి పోస్టు
నా జీవన రేఖ
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2024
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ !
Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha !
Many Many Happy Returns!💐❤️ pic.twitter.com/JcABQQ1Aey