Chiranjeevi: చిరంజీవి రెమ్యునరేషన్ సంచలనం.. అనిల్ రావిపూడి చిత్రానికి భారీ డీల్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్. తన నెక్ట్స్ చిత్రమైన 'మన శంకర వరప్రసాద్ గారు' కోసం చిరు తీసుకుంటున్న భారీ పారితోషికం గురించి వస్తున్న వార్తలు పరిశ్రమంతా హాట్ టాపిక్‌గా మారాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నది తెలిసిందే. యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడన్న వార్తలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.
Details
చిరంజీవి రెమ్యునరేషన్ వివరాలు
'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవికి రూ.72 కోట్ల రెమ్యునరేషన్ అందిస్తున్నారన్న కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం ఒక మోస్తరు బడ్జెట్ సినిమాకు ఎంతో ఎక్కువగా భావించబడుతోంది. సాధారణంగా ఇలాంటి బడ్జెట్ చిత్రాల మొత్తం వ్యయమే ఈ స్థాయిలో ఉండటం విశేషం. ఇక చిరంజీవి సాధారణంగా లాభాల్లో కూడా వాటా తీసుకుంటారు. అయితే ఈ చిత్రం కోసం ముందుగానే ఇంత భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవడం ప్రత్యేకతగా భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను సాహు గారపాటి తో కలిసి చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తోంది. దీంతో లాభాల్లో 50 శాతం వాటా సుష్మితకు రానుండటం కొణిదెల కుటుంబానికి అదనపు ప్లస్ పాయింట్‌గా మారింది.
Details
సినిమాపై భారీ అంచనాలు
అనిల్ రావిపూడి ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో భారీ విజయం సాధించాడు. ఆ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చిరంజీవి-నయనతార జోడీగా సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' రానుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార కనిపించబోతుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రానికి సంక్రాంతి రేసులో ప్రభాస్ నటించిన 'రాజా సాబ్' గట్టి పోటీగా నిలవనున్నా, చిరు-అనిల్ కాంబినేషన్‌కు ఉన్న బలమైన ఫ్యాన్‌బేస్ దృష్ట్యా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.