LOADING...
Meesala Pilla Song: చిరంజీవి స్టైలిష్‌ లుక్లో 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ రిలీజ్ 

Meesala Pilla Song: చిరంజీవి స్టైలిష్‌ లుక్లో 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ రిలీజ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'మీసాల పిల్ల' ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో) విడుదలైంది. దసరా సమయానికి విడుదలైన సాంగ్ ప్రోమో ఇప్పటికే అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో చిరంజీవి స్టైలిష్‌ లుక్‌, ఆయన సొగసు, అలాగే ఉదిత్ నారాయణ్ వాయిస్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్ మొత్తం పూర్తి పాట ఎప్పుడో అని ఎదురుచూశారు. తాజాగా చిత్ర బృందం సర్‌ప్రైజ్‌గా ఫుల్‌ సాంగ్‌ను అందించింది. భాస్కర్లభట్ల రాసిన ఈ పాటకు భీమ్స్ సంగీతం సమకూర్చారు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ మూవీ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో