
Pawan Kalyan: 'దీర్ఘాయుష్మాన్ భవ' అన్న చిరంజీవి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ రిప్లే!
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలతో, ప్రత్యేక పోస్టులతో వేడుక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ అరుదైన ఫొటోను పంచుకుంటూ, "దీర్ఘాయుష్మాన్ భవ" అంటూ పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. చిరంజీవి శుభాకాంక్షలకు పవన్ కల్యాణ్ ఇచ్చిన స్పందన అందరినీ ఆకట్టుకుంది. నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానమైన అన్నయ్య, పద్మవిభూషణ్ చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు నాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చాయి. సమాజానికి సేవ చేయాలనే భావన మీరు నేర్పిన సేవా గుణం వల్లే వచ్చింది. నేడు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ కొనసాగుతున్నాను.
Details
పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షల వెల్లువ
మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, నాకు మాత్రమే కాదు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని పనవ్ కళ్యాణ్ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పవన్ బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హీరో అల్లు అర్జున్ 'మన పవర్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే' అంటూ విషెస్ చెబితే, రామ్ చరణ్ 'మీ నిస్వార్థమైన స్వభావాన్ని చూస్తూ పెరగడం నా అదృష్టం అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో తనదైన శైలితో, రాజకీయాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంటూ పవన్ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నారు.