LOADING...
Chiranjeevi: మెగాస్టార్ నివాసంలో అద్భుతం.. హనుమంతుడి విగ్రహాన్ని తాకిన సూర్య కాంతి.. వీడియో వైరల్
మెగాస్టార్ నివాసంలో అద్భుతం.. హనుమంతుడి విగ్రహాన్ని తాకిన సూర్య కాంతి.. వీడియో వైరల్

Chiranjeevi: మెగాస్టార్ నివాసంలో అద్భుతం.. హనుమంతుడి విగ్రహాన్ని తాకిన సూర్య కాంతి.. వీడియో వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 02, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు ఆంజనేయ స్వామి నామస్మరణలో లీనమయ్యారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్న ఒక అద్భుత వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన ఇంటి పూజ మందిరంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్న విశేష దృశ్యాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.

వివరాలు 

హనుమంతుడి విగ్రహంపై సూర్య కాంతి

గురువారం (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఒక వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఆయన ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న హనుమంతుడి విగ్రహంపై పైనుంచి కింద వరకు సూర్య కిరణాలు ప్రసరించడం స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యం ఎంతో ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిరంజీవి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

వివరాలు 

శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..

చిరంజీవి మాట్లాడుతూ..ఇటీవల అయోధ్యలో బాలరాముడి విగ్రహంపై సూర్య కాంతి పడిన అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్, అరసవిల్లి దేవాలయాల్లో కూడా సూర్య కిరణాలు దేవుడిని తాకే ప్రత్యేకత ఉంది. అలాంటి దైవానుభూతి తన ఇంట్లో కూడా ఆంజనేయ స్వామిని స్పృశించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవిత్ర హనుమజ్జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెగాస్టార్ పోస్ట్ వైరల్..

Advertisement