NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్
    సినిమా

    తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్

    తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 31, 2023, 05:53 pm 0 నిమి చదవండి
    తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్
    తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ లో స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

    నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, ట్విట్టర్ వేదికగా అప్డేట్ ఇచ్చారు. యువగళం పేరుతో లోకేష్ మొదలెట్టిన పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. దాంతో అటు టీడీపీ శ్రేణుల్లో ఇటు నందమూరి అభిమానుల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం బెంగళూరులో తారకరత్నకు వైద్యం జరుగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని, పరిస్థితి కొంచెం సమస్యాత్మకంగా ఉందని హాస్పిటల్ బులెటిన్లు విడుదలయ్యాయి. నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వివరాలు తెలియజేసారు. ఇటీవల మంచు మనోజ్ కూడా బెంగళూరు వెళ్ళి మరీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

    మెగాస్టార్ ట్వీట్ తో ఊపిరి పీల్చుకుంటున్న అభిమానులు

    తారకరత్న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు అందరూ ప్రార్థిస్తున్నారు. ఆ అభిమానులంతా మెగాస్టార్ ట్వీట్ తో ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇక ఏ ప్రమాదమూ లేదనే మాట ఎంతో ఉపశమనం ఇచ్చిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇంకా, తను పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నానని, ఈ పరిస్థితి నుండి కాపాడిన డాక్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు చిరంజీవి. ఇకపోతే తారకరత్న ఆరోగ్యం బాగుపడాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు నందమూరి అభిమానులు. సత్యసాయి జిల్లా హిందూపూర్ లో శివాలయంలో 121 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసారు.

    తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

    సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంకఏ ప్రమాదం లేదు అనే మాటఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలనికోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
    ఆ భగవంతుడికికృతజ్ఞతలు.

    May you have a long and healthy life dear Tarakaratna!

    — Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చిరంజీవి
    తెలుగు సినిమా

    తాజా

    సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
    రెసిపీ: క్యారెట్ లోని పోషకాలు శరీరానికి అందాలంటే క్యారెట్ దోస ట్రై చేయండి రెసిపీస్
    అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సరికొత్త రికార్డును నెలకొల్పిన క్రిస్టియానో ​​రొనాల్డో ఫుట్ బాల్
    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్ ఆటో మొబైల్

    చిరంజీవి

    చిరంజీవి భోళాశంకర్ సినిమాలో లవర్ బాయ్ గా సుశాంత్ తెలుగు సినిమా
    పొన్నంబాలం: సొంత కుటుంబమే విషమిచ్చి చంపాలని చూసింది సినిమా
    రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్ సినిమా

    తెలుగు సినిమా

    ప్రకటించిన సినిమాలను ఆపేసి వేరే సినిమాలను లైన్లోకి తీసుకువచ్చిన హీరోలు, దర్శకులు సినిమా
    ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్ ఓటిటి
    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం సమంత రుతు ప్రభు
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్ సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023