LOADING...
Ram Charan: రామ్ చరణ్ కంటికి శస్త్రచికిత్స.. చిరంజీవి పోస్ట్ వైరల్
రామ్ చరణ్ కంటికి శస్త్రచికిత్స.. చిరంజీవి పోస్ట్ వైరల్

Ram Charan: రామ్ చరణ్ కంటికి శస్త్రచికిత్స.. చిరంజీవి పోస్ట్ వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 26, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కంటికి చిన్న శస్త్రచికిత్స జరిగినట్లు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా చికిత్స చేసిన వైద్యులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ గురించి చిరంజీవి మాట్లాడుతూ..చరణ్ కనురెప్పపై అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహించినందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మొదట తమకు కొంత ఆందోళన కలిగినా, వైద్యులు ధైర్యం చెప్పి భయాన్ని తొలగించారన్నారు. తమ కుటుంబం ఎప్పటికీ ఆ వైద్యులకు రుణపడి ఉంటుందని ఆయన తన పోస్టులో తెలిపారు.

వివరాలు 

త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పోస్ట్

ఈ విషయం తెలిసిన అభిమానులు రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' సినిమా ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement