LOADING...
Chiranjeevi: నా చేయి పట్టుకున్న బాబు… నేడు ఎందరికో స్ఫూర్తి.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
నా చేయి పట్టుకున్న బాబు… నేడు ఎందరికో స్ఫూర్తి.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi: నా చేయి పట్టుకున్న బాబు… నేడు ఎందరికో స్ఫూర్తి.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 27, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకప్పుడు తన చేయి పట్టుకుని నడిచిన చిన్న పిల్లవాడు, ఇప్పుడు అనేక మందికి స్ఫూర్తిగా ఎదిగిన తీరు చూసి తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ సందేశాన్ని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాలు 

తండ్రిగా గర్వపడుతున్నా..

"చరణ్ బాబు... చిన్ననాటి నుండి నా చేయి పట్టుకుని నడిచిన నువ్వు, ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరడం నాకు అపారమైన ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది" అని చిరంజీవి పేర్కొన్నారు. "సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసే తీరు, కుటుంబంపై బాధ్యత, దేవుడిపై విశ్వాసం, క్రమశిక్షణ, విలువలు — ఇవన్నీ చూసిన ప్రతిసారి చరణ్ పై ప్రేమ, గౌరవం మరింత పెరుగుతోందన్నారు. దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ ఎల్లప్పుడూ తనతో ఉండి మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రియమైన రామ్ చరణ్.. అంటూ తన కుమారుడిని ఆశీర్వదించారు చిరంజీవి.

వివరాలు 

శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు

చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా ద్వారా చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ సోదరి, నిర్మాత సుస్మిత కొణిదెల తన ప్రేమను వ్యక్తం చేస్తూ, "అతడే మా బలం, అతడే మా గర్వం, అతడే మా ప్రేమ. నా ప్రియమైన సోదరుడికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతనికి అన్ని శుభాలను ప్రసాదించాలి" అని పేర్కొన్నారు. అలాగే అన్నా కొణిదెల కూడా చరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, "చరణ్ అన్నకు మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ విజయవంతంగా, దృఢంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము" అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇకపోతే చరణ్ బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న చిరంజీవి పోస్ట్: 

Advertisement