Mega 158: చిరు-బాబీ కాంబో సెట్.. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ ధాటిగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడితో 'మన శంకర వరప్రసాద్ గారు' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో, దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాల తర్వాత చిరంజీవి మరో ప్రతిభాశాలి దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
Details
భారీ విజయాన్ని సాధించే అవకాశం
ఇవి ముగిసిన వెంటనే మెగాస్టార్ మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కథ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైందని మేకర్స్ ప్రకటించారు. ఆ డ్రాఫ్ట్‌పై కోల్‌కతా భాషలో ప్రత్యేక కోట్‌ను జోడించడం ద్వారా కథ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని సంకేతాలు ఇచ్చారు. కోల్‌కతా నేపథ్యంలోని చిత్రాలతో చిరంజీవి సృష్టించిన బ్లాక్‌బస్టర్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.