Bobby Kolli - Chiranjeevi: ఈ నెలలోనే చిరు కొత్త సినిమా స్టార్ట్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ కిక్!
ఈ వార్తాకథనం ఏంటి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాలపై కూడా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
Details
ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు
ఇదే సమయంలో బాస్ మరో కొత్త సినిమాను కూడా కన్ఫర్మ్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవికి మర్చిపోలేని హిట్ అయిన 'వాల్టేర్ వీరయ్య'ను అందించిన దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మళ్లీ మెగాస్టార్‌తో జట్టుకట్టనున్నారని సమాచారం. సినీ సర్కిల్‌లో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం.. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా 2026 జనవరి 25న అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Details
ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి
త్వరలోనే పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు, ఇప్పటికే ప్రారంభమైన 'విశ్వంభర' చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులను చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తూ, ఈ ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.