LOADING...
Mana Shankara Varaprasad Garu : చిరు-వెంకీ మాస్ సాంగ్ గ్లింప్స్ అవుట్.. ఫుల్ జోష్ లో అభిమానులు
చిరు-వెంకీ మాస్ సాంగ్ గ్లింప్స్ అవుట్.. ఫుల్ జోష్ లో అభిమానులు

Mana Shankara Varaprasad Garu : చిరు-వెంకీ మాస్ సాంగ్ గ్లింప్స్ అవుట్.. ఫుల్ జోష్ లో అభిమానులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న పాన్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్‌గారు' (Mana Shankara Varaprasad Garu) షూటింగ్ వేగంగా జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'పండగకు వస్తున్నారు' అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్ స్పెషల్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇద్దరి కాంబినేషన్‌లో ఒక ప్రత్యేక పాట కూడా ఉండనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.

Details

 వెంకీ-చిరు మాస్ సాంగ్ గ్లింప్స్ అవుట్!

తాజాగా మేకర్స్ ఈ మాస్ సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. బ్యాక్‌డ్రాప్‌ విజువల్స్ ఫుల్ ఫైరింగ్ మోడ్‌లో ఉండగా, చిరంజీవి-వెంకటేశ్ కలిసి నడుస్తూ థంబ్స్ అప్ ఇస్తున్న షాట్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మెగా విక్టరీ మాస్ సాంగ్... షూటింగ్ కొనసాగుతోందంటూ అనిల్ రావిపూడి టీమ్ షేర్ చేసిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంతకుముందు విడుదల చేసిన 'మీసాల పిల్ల' సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇప్పుడు మెగా-విక్టరీ కాంబో సాంగ్ పై మరింత పెద్ద స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈసాంగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement