LOADING...
Tollywood Movies: క్రిస్మస్‌కు సినిమాల వరద.. ఒకే రోజున ఇన్ని సినిమాలా!
క్రిస్మస్‌కు సినిమా వరద.. ఒకే రోజున ఇన్ని సినిమాలా!

Tollywood Movies: క్రిస్మస్‌కు సినిమాల వరద.. ఒకే రోజున ఇన్ని సినిమాలా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి క్రిస్మస్‌ సీజన్‌కు సినిమా సందడి అసాధారణంగా ఉంది. ఇటీవల కాలంలో క్రిస్మస్‌కు ఇంత భారీగా సినిమాలు రిలీజవడం ఇదే తొలిసారి అనుకోవచ్చు. డిసెంబర్‌ 25న ఏకంగా ఎనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాస్తవానికి కొన్ని చిత్రాలు డిసెంబర్‌ 12న విడుదల కావాల్సి ఉండగా పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డాయి. అయితే 'అఖండ-2' మాత్రం అనుకున్న షెడ్యూల్‌కు రాకుండా డిసెంబర్‌ 12ననే విడుదలైంది. దాంతో మిగిలిన కొన్ని సినిమాలు క్రిస్మస్‌ డేట్‌ను ఎంచుకున్నాయి. మోగ్లీ', 'డ్రైవ్' వంటి చిత్రాలు మాత్రం ముందే అనుకున్న సమయానికే థియేటర్లలోకి వచ్చాయి. మిగతావి డిసెంబర్‌ 19, డిసెంబర్‌ 25 తేదీల్లో రిలీజ్‌కు సిద్ధమయ్యాయి.

Details

డిసెంబర్ 24న 'అన్న గారు వస్తారు'

మొదటి నుంచే క్రిస్మస్‌కే ఫిక్స్ అయిన సినిమాలుగా శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ మేకా నటించిన 'ఛాంపియన్', ఆది సాయికుమార్‌ హీరోగా తెరకెక్కిన 'శంబాల', శివాజీ కీలక పాత్రలో కనిపించే 'దండోరా' ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు 'ఈషా', 'బ్యాడ్ గాళ్స్' కూడా అదే రోజున విడుదలవుతున్నాయి. ఇక డిసెంబర్‌ 26న 'వానర' థియేటర్లలోకి రానుంది. ఆసక్తికరంగా, నటుడు నందు 'దండోరా', 'వానర' రెండింటిలోనూ కీలక పాత్రలు పోషించడం విశేషం. స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలతో పాటు అనువాద చిత్రాలు కూడా క్రిస్మస్‌ రేసులో ఉన్నాయి. కార్తి హీరోగా నటించిన 'అన్నగారు వస్తారు' డిసెంబర్‌ 25కి ఒకరోజు ముందే అంటే డిసెంబర్‌ 24న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Details

డిసెంబర్ 25న వృషభ

అలాగే కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌ నటించిన 'మార్క్', మోహన్‌లాల్‌ హీరోగా రూపొందిన 'వృషభ' డిసెంబర్‌ 25న రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మోహన్‌లాల్‌ 'వృషభ'ను తెలుగునాట గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తుండటంతో ఆ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. కార్తి 'అన్నగారు వస్తారు' కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకే రోజు ఇన్ని సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల లభ్యత సమస్య తలెత్తే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ ఉన్న సినిమాలకే విజయం దక్కుతుందన్నది వారి మాట. హారర్‌ మూవీ 'ఈషా'కు మంచి బజ్ ఉండగా, ఆది సాయికుమార్‌ నటించిన 'శంబాల'పై కూడా కొందరు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Details

తన

రోషన్‌ మేకా 'ఛాంపియన్' ఆకట్టుకునే కథాంశంతో రూపొందిందని ప్రచారం జరుగుతోంది. అలాగే శివాజీ కీలక పాత్రలో నటించిన 'దండోరా'లోనూ బలమైన విషయం ఉందని ట్రేడ్ టాక్. మొత్తానికి చిన్న సినిమాలైనా సరే... ఈ క్రిస్మస్‌కు రిలీజవుతున్న ప్రతీ చిత్రంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఈ స్ట్రెయిట్‌ తెలుగు సినిమాల్లో ఏది పైచేయిగా నిలుస్తుందో చూడాలి.

Advertisement