LOADING...
Cinema Impact: సినిమా ప్రభావం.. 'మరో చరిత్ర' మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు..
సినిమా ప్రభావం.. 'మరో చరిత్ర' మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు..

Cinema Impact: సినిమా ప్రభావం.. 'మరో చరిత్ర' మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాలు సమాజంపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. హీరోలు, హీరోయిన్లను చూసి వారి మాదిరిగానే హెయిర్ స్టైల్, దుస్తులు, ప్రవర్తనను అనుకరించే అభిమానులు చాలామంది ఉంటారు. అయితే ఒక సినిమాను చూసి ఇన్ స్పైర్ అయ్యి ఏకంగా ప్రాణాలు తీసుకునేవరకు వచ్చారు. నమ్మలేకున్నా ఇది పచ్చినిజం. ప్రసిద్ధ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన మరో చరిత్ర సినిమా 1978లో విడుదలై అప్పట్లో భారీ సంచలనం సృష్టించింది. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ ప్రేమకథ చిత్రం అపూర్వ విజయాన్ని సాధించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, భావోద్వేగాలు యువతను బలంగా ఆకట్టుకున్నాయి.

వివరాలు 

క్లైమాక్స్ చూసి 20 ప్రేమ జంటలు..

అయితే ఈసినిమాకు వచ్చిన ప్రశంసలతో పాటు దాని క్లైమాక్స్ కూడా విపరీతమైన చర్చకు దారితీసింది. కథలో ప్రేమించిన హీరో,హీరోయిన్ చివర్లో కలిసి ఉండలేమనే బాధతో కొండపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్స్ రాలేదని చెప్పవచ్చు. ఈ క్లైమాక్స్ సీన్ అప్పటి యువతను ఎంతలా ప్రభావితం చేసిందంటే.. ప్రేమలో విఫలమైన చాలా జంటలు ఆత్మహత్య చేసుకున్నాయట. పెద్దలు ఒప్పుకోకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు,ఈ చిత్రంలోని సంఘటనలతో ప్రేరణ పొంది ప్రాణాలు తీసుకున్నారని చెబుతారు. మొత్తం దాదాపు 20ప్రేమజంటలు,అంటే 40మంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రచారం జరిగింది. ఈవిషయం అప్పట్లో సినీ రంగంలోనే కాక సమాజంలోనూ పెద్ద సంచలనంగా మారింది.

Advertisement