యాక్షన్ సీన్స్ లో నటించడంపై సమంతను హెచ్చరిస్తున్న కోస్టార్స్
మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత ఆరోగ్యం ఈ మధ్య కొంచెం కుదుటపడింది. అందువల్లే సినిమా షూటింగుల్లో పాల్గొంటుంది. గతకొన్ని రోజులుగా ఇండియన్ వెర్షన్ సిటాడెల్ షూటింగ్ లో పాలు పంచుకుంటోంది సమంత. ఈ షూటింగ్ లో ఎక్కువ శాతం యాక్షన్ సీన్లు ఉన్నాయట. దానికోసం సమంత చాలా కష్టపడుతోందని తెలుస్తోంది. అయితే సిటాడెల్ దర్శకులు రాజ్ డీకేలతో పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె అంది. వీరిద్దరు తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చింది. సిటాడెల్ లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయనీ, వాటిని పర్ఫామ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అంది. ఇంకా, యాక్షన్ సీన్స్ అనగానే ముందూ వెనుకా ఆలోచించకుండా సమంత చేసేస్తోందట.
ప్రిపేర్ అవమంటున్న కో స్టార్స్
యాక్షన్ సీన్స్ విషయంలో సమంత చొరవ చూపిస్తుంటే కో స్టార్స్ మాత్రం అంత దూకుడుగా ఉండవద్దనీ, ముందూ వెనుకా ఆలోచించాలనీ, ముందుగా ప్రిపేర్ అవ్వమని సలహా ఇస్తున్నారట. కానీ సమంత మాత్రం యాక్షన్ సీన్స్ లో ఆసక్తి చూపిస్తోందట. యాక్షన్ సీన్స్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో తనకు తెలుసని ఆమె చెప్పుకొచ్చింది. ప్రతీసారీ యాక్షన్ సీన్స్ లో బాగా చేస్తుందని అనిపించుకోవడం చాలా కష్టమని తనకు తెలుసని ఆమె చెప్పింది. కాకపోతే తన సామర్థ్యాన్ని పెంచుకుని మరీ యాక్షన్ సీన్స్ బాగా చేయాలని ఆమె ప్రయత్నిస్తోందట. రుస్సో బ్రదర్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో కలిసి రూపొందిస్తున్న సిటాడెల్, మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.