హాలీవుడ్ సినిమాల్లో పనిచేసే సత్తా భారతీయులకు ఉందంటున్న ప్రియాంకా చోప్రా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిటాడెల్ సిరీస్, ఏప్రిల్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది.
ఈ నేపథ్యంలో సిటాడెల్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న ప్రియాంక, హాలీవుడ్ సినిమాల్లో భారతీయులు పనిచేయడం గురించి మాట్లాడింది.
హాలీవుడ్ సినిమాల్లో పనిచేసే సత్తా భారతీయులకు ఉందని, అంతర్జాతీయ తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇండియన్స్ పనిచేస్తున్నారని, మహిళలు కూడా రచయితలుగా, దర్శకులుగా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆమె అంది.
మనదేశంలో టాలెంట్ చాలా ఉందని, అందుకే హాలీవుడ్ సినిమాల్లోనూ మనవాళ్ళు రాణించాలని కోరుకుంటున్నానని ప్రియాంకా చోప్రా తెలిపింది. ఆ తర్వాత హాలీవుడ్ లో తన పారితోషికం గురించి మాట్లాడింది ప్రియాంక.
Details
మేల్ యాక్టర్స్ తో సమానంగా పారితోషికం
గత కొన్నేళ్ళుగా హాలీవుడ్ లో బిజీగా ఉంటున్న ప్రియాంక, మేల్ యాక్టర్స్ తో సమానమైన పారితోషికం తీసుకోవడానికి తనకు పదేళ్ళు పట్టిందని తెలియజేసింది.
మరో ఐదేళ్ళలో పారితోషికం విషయంలో చాలా మార్పులు రానున్నాయని అంది.
సిటాడెల్ సిరీస్ కోసం ఆడిషన్ కూడా ఇవ్వలేదట. తనను ఆడిషన్ ఎవరూ అడగలేదని, బాలీవుడ్ లో యాక్షన్ ప్రాధాన్యమున్న సినిమాలు చేసాననీ, వాటివల్లే సిటాడెల్ సిరీస్ లో తనకు అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఏప్రిల్ 28వ తేదీన సిటాడెల్ సిరీస్ లో రెండు ఎపిసోడ్లు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నాయి. ఆ తర్వాత ప్రతీ శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవుతుందని సమాచారం. సిటాడెల్ సిరీస్ ని హాలీవుడ్ దర్శకులు రుస్సో బ్రదర్స్ నిర్మించారు.