సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు
ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు ఇండియన్ వెర్షన్ సిటాడెల్ సిరీస్ లో కనిపిస్తున్న సమంత, వరుణ్ ధావన్ హాజరయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సమంత, వరుణ్ ధావన్ ల ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ప్రీమియర్ కు ఇండియన్ వెర్షన్ సిటాడెల్ దర్శకులైన రాజ్, డీకే కూడా హాజరయ్యారు. అయితే ఈ ప్రీమియర్ షోలో వీళ్లంతా బ్లాక్ అండ్ బ్లాక్ లో మెరిసిపోయారు. వరుణ్ ధావన్, సమంత పూర్తి బ్లాక్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇంకా ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఫోటోలు దిగారు. ఎరుపు రంగులో తళతళ మెరిసిపోతున్న ప్రియాంకను ఇక్కడ చూడవచ్చు.
ఏప్రిల్ 28నుండి అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్
సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 28వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. ముందుగా రెండు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. మే 26వ తేదీ నుండి ప్రతి శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ కానుందని సమాచారం. సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ వెబ్ సిరీస్ ని హాలీవుడ్ దర్శకులైన రుస్సో బ్రదర్స్ క్రియేట్ చేశారు. అదలా ఉంచితే, ఇండియన్ వెర్షన్ సిటాడెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సిరీస్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయని, వాటిల్లో సమంత చాలా బాగా నటిస్తోందని ఇదివరకు వార్తలు వచ్చాయి. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించిన రాజ్, డీకే మరోసారి సిటాడెల్ తో వినోదం పంచాలని చూస్తున్నారు.