NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2: పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2: పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్
    పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్

    Pushpa 2: పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఈ సినిమా మొదటి రోజు సంచలన రికార్డులు సృష్టిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

    ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, 'పుష్ప 2' మొదటి రోజునే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

    మరోవైపు, ఈ సినిమా ప్రమోషన్లకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

    ఇదిలా ఉండగా, ఈ చిత్రంలోని ఐటెం సాంగ్‌ విడుదల తేదీని ఖరారు చేశారు.

    వివరాలు 

    శ్రీలీల ఐటెం సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు 

    శ్రీలీల ఈ పాటలో డాన్స్ చేయగా, ఇది 'పుష్ప'లోని ఊ అంటావా పాట తరహాలోనే సంచలనం సృష్టించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

    అయితే, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తికాలేదని సమాచారం.

    దర్శకుడు సుకుమార్ ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టడంతో పాటు, మిగిలిన షూటింగ్ పార్ట్‌ను కూడా త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు.

    షూటింగ్‌లో రెండు, మూడు యూనిట్లుగా పని చేస్తూ సమయాన్ని ఆదా చేస్తున్నారు.

    వివరాలు 

    షూటింగ్ పూర్తి తేదీ,రిలీజ్ రూమర్స్ 

    నవంబర్ 27, 28 నాటికి షూటింగ్ పూర్తవుతుందని అంచనా. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

    అయితే, సినిమా విడుదలకు అప్పటికే కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగులుతుంది.

    ఈ సమయంలో ఫస్ట్ కాపీ సిద్ధం కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, సినిమా విడుదల తేదీ మారుతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    అయితే, ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతూ పుష్ప టీమ్ అధికారిక క్లారిటీ ఇచ్చింది.

    ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన జీఐఎఫ్ వీడియోలో,డిసెంబర్ 5న సినిమా విడుదల చేస్తున్నామని స్పష్టంగా ప్రకటించారు.

    "తగ్గేదిలే" అంటూ ఇచ్చిన ఈ ప్రకటనతో, సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు టీమ్ మొత్తం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మాణ సంస్థే చేసిన ట్వీట్ 

    DECEMBER 5th ~ #AssaluThaggedheLe 😎🔥🤙🏻 #RappaRappa 💥💥💥#Pushpa2TheRule pic.twitter.com/96IcsPoWfV

    — Pushpa (@PushpaMovie) November 22, 2024

    వివరాలు 

    ప్రమోషనల్ ఈవెంట్స్, అల్లు అర్జున్ పాత్ర 

    దర్శకుడు సుకుమార్ మొత్తం చిత్ర అవుట్‌పుట్‌పై ఫోకస్ చేయగా, అల్లు అర్జున్ ప్రమోషన్ల బాధ్యతలను తీసుకున్నట్లు సమాచారం.

    చక్కటి ప్లానింగ్‌తో సినిమాను పబ్లిక్‌కు చేరవేయడానికి బన్నీ స్వయంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

    ఐటెం సాంగ్ విడుదల ఈవెంట్ చెన్నైలో జరగనుండగా, ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరవుతారు.

    'పుష్ప 2' పై భారీ అంచనాలు ఉన్న ఈ సమయంలో, టీమ్ అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని అన్నివిధాలుగా కృషి చేస్తోంది.

    అల్లు అర్జున్, సుకుమార్ సహకారంతో ఈ సినిమా మరో చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    పుష్ప 2

    Pushpa 2: పుష్ప..పుష్ప..పుష్ప.. పుష్ప రాజ్..  పుష్ప 2 నుంచి లిరికల్ ప్రోమో వచ్చేసింది  సినిమా
    Pushpa 2: పుష్ప సినిమా నుండి మే1న సెన్సేషనల్ సర్ప్రైజ్  సినిమా
    Pushpa 2: పుష్ప.. ది రూల్‌ నుంచి పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ లాంఛ్.. ఎప్పుడంటే? సినిమా
    Pushpa 2: నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే..  పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025