NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మంచు మనోజ్ పోస్ట్ తో బయటపడ్డ అన్నదమ్ముల గొడవలు, స్పందించిన మోహన్ బాబు
    తదుపరి వార్తా కథనం
    మంచు మనోజ్ పోస్ట్ తో బయటపడ్డ అన్నదమ్ముల గొడవలు, స్పందించిన మోహన్ బాబు
    మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య బయటపడ్డ గొడవలు

    మంచు మనోజ్ పోస్ట్ తో బయటపడ్డ అన్నదమ్ముల గొడవలు, స్పందించిన మోహన్ బాబు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 24, 2023
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడా విషయం నిజమేనని మంచు మనోజ్ పోస్ట్ తో తేలిపోయింది.

    వారిద్దరి మనస్పర్థలు ఎందుకు వచ్చాయన్న సంగతి తెలియదు కానీ, మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ ప్రకారం, మనోజ్ కి కావాల్సిన మనిషైన సారథి దగ్గరకు వచ్చిన మంచు విష్ణు,అతనితో గొడవ పడినట్లు వీడియోలో కనిపిస్తుంది.

    అంతేకాదు, నా ఇష్టం అంటూ మంచు విష్ణు మాటలు వినిపించాయి. ఈ వీడియోను తన ఫేస్ బుక్ స్టోరీగా మనోజ్ పెట్టడంతో ఈ గొడవంతా బయటకు వచ్చేసింది.

    దీంతో సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద చర్చ నడుస్తోంది.

    మంచు మనోజ్

    మనోజ్ పెళ్ళికి అతిథిలా వచ్చిన మంచు విష్ణు

    మొన్నటికి మొన్న మనోజ్ పెళ్ళిలో మంచు విష్ణు యాక్టివ్ గా కనిపించలేదనీ, కేవలం పెళ్ళి రోజు మాత్రమే విష్ణు కనిపించారనీ, పెళ్ళి కూడా మంచు లక్ష్మీ నివాసంలో జరిగిందనీ వార్తలు వచ్చాయి.

    మనోజ్ పెళ్ళికి అతిథిగా మంచు విష్ణు రావడంతో, వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని, గొడవలు బాగా పెరిగాయన్న మాటలు విరివిగా వినిపించాయి.

    ప్రస్తుతం ఈ గొడవలు నిజమేనని తేలిపోయింది. అయితే మనోజ్ పోస్ట్ పై మోహన్ బాబు స్పందించారని, అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే అనీ, ఆవేశం తెచ్చుకుంటే ఇద్దరికీ అనర్థమనీ, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నానని మోహన్ బాబు తెలిపినట్లు టీవీ 9 రాసుకొచ్చింది.

    ప్రస్తుతం ఆ వీడియోను మంచు మనోజ్, ఫేస్ బుక్ నుండి డిలీట్ చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలుగు సినిమా

    కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని టాలీవుడ్
    పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే అల్లు అర్జున్
    వైరల్ అవుతోన్న నరేష్ పవిత్రల పెళ్ళి వీడియో సినిమా
    కేజీఎఫ్ కాంట్రవర్సీ: వెంకటేష్ మహాకు క్లాస్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా

    సినిమా

    రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్ టాలీవుడ్
    పవన్ కళ్యాణ్ సరసన ధమాకా బ్యూటీకి ఛాన్స్? పవన్ కళ్యాణ్
    యాక్షన్ ఇచ్చిన బహుమతులంటూ గాయాలను చూపుతున్న సమంత సమంత రుతు ప్రభు
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు మహేష్ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025