Page Loader
మంచు మనోజ్ మ్యారేజ్: పెళ్ళి కూతురును పరిచయం చేసిన హీరో
భూమా మౌనికను వివాహం చేసుకుంటున్న మంచు మనోజ్

మంచు మనోజ్ మ్యారేజ్: పెళ్ళి కూతురును పరిచయం చేసిన హీరో

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 03, 2023
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎట్టకేలకు మంచు మనోజ్ పెళ్ళికి సిద్ధమయ్యాడు. భూమా మౌనిక రెడ్డిని ఈరోజు వివాహం చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన అభిమానులకు పెళ్ళికూతురు భూమా మౌనికను పరిచయం చేసాడు మనోజ్. భూమా మౌనిక ఫోటోని షేర్ చేసి, పెళ్ళి కూతురు అంటూ పరిచయం చేసాడు. ఆ ఫోటోలో భూమా మౌనిక వెలిగిపోతోంది. పసుపు రంగు చీరలో పెళ్ళి కూతురుగా అందంగా ఉంది. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్, భూమా మౌనికల బంధం మీద చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక.. గతంలో తమ జీవితాల్లో ఇతర వ్యక్తులను పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని ఇప్పుడు కొత్త జీవితానికి నాంది పలుకుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెళ్ళి కూతురును పరిచయం చేసిన మంచు మనోజ్