Page Loader
Comedian Satya Success: క‌మెడియ‌న్ ద‌శ మార్చిన సీరియల్.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్..ఇది కదయ్యా జర్నీ అంటే..
కమెడియ‌న్ ద‌శ మార్చిన సీరియల్.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్

Comedian Satya Success: క‌మెడియ‌న్ ద‌శ మార్చిన సీరియల్.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్..ఇది కదయ్యా జర్నీ అంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

సక్సెస్ ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తేస్తుంది. సక్సెస్ లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతుంటారు. కష్టపడటం లేదా టాలెంట్ ఉండటం కాకుండా, కొంత టైం కలిసి రావడం ముఖ్యం. సత్యకు ఇప్పుడు అలాంటి టైం కలిసి వచ్చింది. కమెడియన్ సత్య టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది దర్శకులు ఆయన టైమింగ్‌ను వాడుకున్నారు. "మత్తు వదలరా" సినిమా ద్వారా సత్య తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, "మత్తు వదలరా 2" చిత్రంతో టాలీవుడ్‌లో అలజడి సృష్టిస్తున్నాడు. చిరంజీవి, మహేష్ బాబు వంటి ప్రముఖులు కూడా సత్య గురించి ప్రస్తావిస్తున్నారు.

వివరాలు 

మత్తు వదలరా 2లో అసలు హీరో సత్య 

"మత్తు వదలరా 2" చిత్రంలో అసలు హీరో సత్య అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. హీరో శ్రీ సింహా సక్సెస్ మాట్లాడుతూ.. అమృతం సీరియల్‌లో సత్యతో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. అయితే సత్య ఆ సీరియల్‌లో పని చేశాడని, యాక్ట చేశాడని చాలా మందికి తెలియదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన సత్య.. ఇప్పుడు టాప్ కమెడియన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం, సత్య పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. అమృతం సీరియల్‌లో ఆయన నటించిన ఎపిసోడ్‌లు, వాటి క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పటి నుంచి ఉన్నాడా? అప్పుడు కూడా భలే నటించాడే అని అంతా అనుకుంటున్నారు. సత్య చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు సక్సెస్‌ను అనుభవిస్తున్నాడని అందరూ అభినందిస్తున్నారు.

వివరాలు 

రంగబలిలో కామెడీ 

సత్య టైమింగ్ నేటి ఆడియెన్స్‌ను మురిసిపోయేలా చేస్తోంది. కామెడీనే కాకుండా, డ్యాన్స్‌లో కూడా ఆయన మంచి ప్రతిభను ప్రదర్శించాడు. బ్రహ్మానందం, సునీల్‌లను సత్య రీప్లేస్ చేస్తాడని భావిస్తున్నారు. భవిష్యత్తులో, ఏ స్టార్ హీరో సినిమా అయినా, సత్యకు ప్రత్యేక ట్రాక్ రాస్తారనిపిస్తోంది. సత్య 'ద్రోణ' చిత్రంలో కూడా చిన్న పబ్‌కు వచ్చే పాత్రలో కనిపించాడు. కళావర్ కింగ్, కోడిపుంజు, పిల్ల జమిందార్, చమ్మక్ చలో వంటి చిత్రాలతో కమెడియన్‌గా తన ప్రత్యేకతను చూపించాడు. నిఖిల్ స్వామిరారా చిత్రంతో సూపర్ క్రేజ్ సాధించిన సత్య,తరువాతి ప్రతి సినిమాతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కానీ, రంగబలి చిత్రానికి 'యావరేజ్' టాక్ వచ్చినా, ఈ చిత్రంలో సత్య చేసిన కామెడీనే ప్రధాన కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సత్య సీరియల్ క్లిప్స్