LOADING...
The RajaSaab: 15 ఏళ్ల తర్వాత పూర్తి ఎంటర్‌టైనర్‌తో వస్తున్నా: ప్రభాస్

The RajaSaab: 15 ఏళ్ల తర్వాత పూర్తి ఎంటర్‌టైనర్‌తో వస్తున్నా: ప్రభాస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

15 ఏళ్ల తర్వాత 'ది రాజాసాబ్‌' (The RajaSaab) వంటి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని ప్రభాస్‌ (Prabhas) అన్నారు. ఆయన కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ 'ది రాజాసాబ్‌'. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా నటించగా, తమన్‌ సంగీతం అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్‌ వేడుక ఘనంగా నిర్వహించారు.

Details

తన

ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ మాట్లాడుతూ.. ''హారర్‌ జానర్‌లో ఇప్పటివరకూ ఎవరూ చూడని సరికొత్త కథాంశంతో 'ది రాజాసాబ్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంజయ్‌ దత్‌ ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తే మొత్తం సీన్‌ ఆయనే డామినేట్‌ చేస్తారు. ఇది నానమ్మ-మనవడి కథ. రిద్ది, మాళవిక, నిధి అగర్వాల్‌ ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ సినిమాకు అసలైన హీరో నిర్మాత విశ్వప్రసాద్‌. మొదట అనుకున్న బడ్జెట్‌ వేరు, సినిమా ప్రయాణం మూడేళ్ల పాటు సాగింది. బడ్జెట్‌ విషయంలో కొన్నిసార్లు మేం భయపడ్డాం కానీ, విశ్వప్రసాద్‌గారు మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

Details

మారుతి రైటింగ్ కు ఫిదా

ఇలాంటి కథకు తమన్‌ లాంటి వ్యక్తి మాత్రమే సరైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వగలరు. ఇది దర్శకుడు మారుతి మూడేళ్ల ఒత్తిడి, బాధ్యత. నా సినిమాలన్నీ యాక్షన్‌ జానర్‌లోనే ఉంటున్నాయని చెప్పగానే, మారుతి హారర్‌ కామెడీని సిద్ధం చేశారు. క్లైమాక్స్‌ దశకు వచ్చేసరికి మారుతి రైటింగ్‌కు ఫిదా అయ్యాను. 'డార్లింగ్‌.. ఈ క్లైమాక్స్‌ను పెన్‌తో రాశావా, మెషీన్‌ గన్‌తో రాశావా?' అనిపించింది. ఇప్పటివరకూ చూడని సరికొత్త క్లైమాక్స్‌ను ప్రేక్షకులు చూస్తారు. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలూ హిట్‌ కావాలని తెలిపారు.

Advertisement

Details

మారుతి భావోద్వేగం 

అంతకు ముందు దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌' జరుగుతున్న సమయంలో ముంబయికి వెళ్లి ప్రభాస్‌ను కలిశాను. ఆయన రాముడి గెటప్‌లో ఉండగానే కలిసిన సందర్భం ఇది. ఆ రోజు ఆయన్ను బాగా నవ్వించాను. అదే గుర్తుపెట్టుకుని నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. 'బాహుబలి' చేసిన స్టార్‌ నాతో సినిమా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఒక తెలుగు హీరోను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన వ్యక్తి ఎస్‌.ఎస్‌. రాజమౌళి. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్‌. 11 సినిమాలు చేసిన ఒక దర్శకుడిని రెబల్‌ యూనివర్సిటీకి తీసుకొచ్చారు. నేను రాశాను, నేను తీశాను.. కానీ నా వెనుక ఉన్న శక్తి అసాధారణం.

Advertisement

Details

కన్నీళ్లు ఆగడం లేదు

ప్రభాస్‌ ఈ సినిమాకు తన లైఫ్‌నే పెట్టారు. ఆయనకు సినిమా పట్ల ఉన్న భక్తి, శ్రద్ధ మాటల్లో చెప్పలేనిది. మూడేళ్ల కష్టంతో 'రాజాసాబ్‌'ను తీసుకొచ్చాం. సంక్రాంతికి ఇతర సినిమాలు ఉన్నా ధైర్యంగా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ జానర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాం. ఆర్‌ఆర్‌ తర్వాత సన్నివేశాలు చూస్తుంటే నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు. అంతటి నటన చూపిన ప్రభాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత విశ్వప్రసాద్‌, కథానాయికలు మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌, నిధి అగర్వాల్‌, నటులు సప్తగిరి, వీటీవీ గణేశ్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement