LOADING...
Sankranthiki Vasthunam OTT:'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ కంటే ముందు టీవీలో..?
'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ కంటే ముందు టీవీలో..?

Sankranthiki Vasthunam OTT:'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ కంటే ముందు టీవీలో..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్ రాబట్టింది. విడుదలై దాదాపు నెల రోజులు పూర్తవుతున్నా, థియేటర్లలో ఇంకా మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అన్న ప్రశ్నకు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జీ5 భారీ ట్విస్ట్ ఇచ్చింది!

Details

డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న జీ5

ఈ సినిమా ఓటిటి, డిజిటల్ రైట్స్‌ను జీ5 తెలుగు సొంతం చేసుకుంది. తాజాగా జీ తెలుగు తన సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. మళ్లీ సంక్రాంతి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టు షేర్ చేసింది. అంతేకాదు 'OTTకన్నా_TVముందు' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేయడం విశేషం. అంటే సినిమా ముందుగా టెలివిజన్‌లో ప్రీమియర్‌ కానుంది. ఇంతకు ముందు ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించినప్పటికీ, థియేటర్లలో సినిమా వసూళ్ల హవా కొనసాగుతుండటంతో ఓటిటి విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Details

త్వరలోకి టీవీలోకి

ఇప్పుడు ముందుగా టీవీ ప్రీమియర్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడంతో, కుటుంబసభ్యులంతా కలిసి చూడగలిగే సినిమా. ఓటిటిఈ కారణంగా ఓటిటికి ముందు టెలివిజన్‌లో ప్రీమియర్‌ చేస్తే టీఆర్‌పీ రేటింగ్స్ భారీగా వస్తాయి అన్నదే టీమ్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా, దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కింది. ఓటిటి విడుదల ఆలస్యమైనా, థియేటర్లలో ప్రేక్షకుల స్పందన మాత్రం తగ్గలేదు . సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. త్వరలో టీవీలో కూడా సందడి చేయనున్న ఈ మూవీ అందరికీ మరింత చేరువ కానుంది.