Sankranthiki Vasthunnam Review: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ.. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించాడా?
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేష్‌లో ఇప్పటికే వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు విజయవంతమయ్యాయి. తాజాగా వీరద్దరి కలయికలో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.
ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లగా నటించారు. సంక్రాంతికి కానుకగా రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
వైడీ రాజు (వెంకటేష్) అనే ఐపీఎస్ ఆఫీసర్ తన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గుర్తింపు తెచ్చుకుంటాడు. వందకు పైగా ఎన్‌కౌంటర్ల తర్వాత చేయని తప్పుకు సస్పెండ్ అవుతాడు.
అనంతరం పోలీస్ జాబ్‌కు రిజైన్ చేసి సొంతూరికి వస్తాడు. అక్కడ భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమెతో ఇల్లరికం అల్లుడిగా జీవనం ప్రారంభిస్తాడు.
Details
కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించిన దర్శకుడు
అయితే రాజును వెతుక్కుంటూ అతడి మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌధరి) రావడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఇదే సమయంలో బిజినెస్‌మెన్ ఆకెళ్ల (శ్రీనివాస్ అవసరాల)ను బీజు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.
ఆకెళ్లను కాపాడటానికి రాజుకు అప్పగించిన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగ్యలక్ష్మి, మీనాక్షి కలిసి వెళ్లడం కథలో హాస్యాన్ని, డ్రామాను పెంచుతుంది.
అనిల్ రావిపూడి కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
సినిమా ఆరంభంలో రాజు పోలీస్ కెరీర్ గురించి చూపించడంతో పాటు భాగ్యలక్ష్మితో ఉన్న రొమాన్స్, రాజు కొడుకుతో సన్నివేశాలు సరదాగా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తంగా మంచి ఫన్ జెనరేట్ చేసింది.
Details
వెంకటేష్ నటన అద్భుతం
సెకండాఫ్‌లో కిడ్నాప్ డ్రామా, సీరియస్ టోన్ మిళితమై కథ కొంత తేలిపోతుంది.
అనిల్ రావిపూడి సినిమాల్లో లాజిక్‌లు కంటే మ్యాజిక్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లు ఎక్కువగా బలంగా అనిపించవు.
ఇక భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించాడు. మీనాక్షి చౌదరి కూడా తన పాత్రకు న్యాయం చేసింది.
భీమ్స్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. 'గోదారి గట్టు' పాట ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
మొత్తానికి సంక్రాంతి సెలవుల్లో కుటుంబమంతా కలిసి నవ్వుతూ చూడదగిన సినిమా. లాజిక్‌లను పక్కన పెట్టి చూస్తే మరింత ఆనందించవచ్చు.