Page Loader
Kantara Chapter 1: కాంతార షూటింగ్ వద్ద కలకలం.. రిష‌బ్ షెట్టికి ప్ర‌మాదం
కాంతార షూటింగ్ వద్ద కలకలం.. రిష‌బ్ షెట్టికి ప్ర‌మాదం

Kantara Chapter 1: కాంతార షూటింగ్ వద్ద కలకలం.. రిష‌బ్ షెట్టికి ప్ర‌మాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాంతార: చాప్టర్ 1కు వరుస ప్రమాదాలు అడ్డంవస్తున్నాయి. గతేడాది ఈ సినిమాలో భాగంగా ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దాని వెంటనే నటుడు కపిల్‌ నదిలో కొట్టుకుపోయి మృతి చెందగా, ఆ తర్వాత రాకేశ్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) కూడా గుండెపోటుతో కన్నుమూశారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ విషాద ఘటనలు చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. అయితే శనివారం మరో ప్రమాదం చోటుచేసుకుంది.

Details

బోట్ ప్రమాదంలో 30 మంది ఆర్టిస్టులు

ప్రస్తుతం కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద కాంతార: చాప్టర్ 1 షూటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో రిషబ్ షెట్టితో పాటు 30 మంది ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బోట్ ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా బోటు నీటిలో తడబడగా, అందులో ఉన్నవారంతా ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో చిత్రీకరణకు ఉపయోగించిన కెమెరాలు, పరికరాలు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. శుభం శీఘ్రమే అన్నట్లుగా ఈ ప్రమాదం నుంచి రిషబ్ షెట్టి సహా పలువురు నటులు బయటపడటం ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయినప్పటికీ వరుస ఘటనలతో కాంతార: చాప్టర్ 1 చిత్రయూనిట్ శోకసంద్రంలో మునిగిపోయింది.