Mahavatar Narasimha : హాలీవుడ్ దిగ్గజాలతో పోటీ.. ఆస్కార్ రేసులో 'మహావతార్ నరసింహా'
ఈ వార్తాకథనం ఏంటి
భారత యానిమేషన్ రంగానికి మరో గర్వకారణం గా నిలిచింది 'మహావతార్ నరసింహా' సినిమా. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 98వ ఆస్కార్ నామినేషన్స్‌లో యానిమేషన్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ మూవీ, పురాణ ఇతిహాసాలపై ప్రేక్షకుల ఆసక్తి, యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలకు ఉన్న అవకాశాలను స్పష్టంగా నిరూపించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహ స్వామి కథ, ప్రహ్లాదుని భక్తి, ప్రతి సన్నివేశంలో కనపడిన డివోషనల్ వైబ్ ప్రేక్షకులను ఆకట్టాయి. మంచి సంగీతం, ఆకట్టుకునే సన్నివేశాల కలయిక ఈ సినిమాకు భారీ హైప్‌ను సృష్టించింది. ఈ విజయాన్ని చూసి అనేక ప్రొడక్షన్ హౌసెస్ కూడా యానిమేషన్ సినిమాల వైపు మళ్లడం మొదలుపెట్టాయి.
Details
రూ.300 కోట్లకు పైగా వసూలు
హోంబలే ప్రొడక్షన్స్ సుమారు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ ఎంతో నిబద్ధతతో రూపొందించారు. థియేట్రికల్ రన్‌లో 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డులు, రివార్డులు అందుకున్న 'మహావతార్' ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ ద్వారా తన విస్తృత స్థాయిని మరల నిరూపించింది. అయితే పోటీలో 'పాప్ డీమన్ హంటర్స్', 'ఇన్ఫినిటీ కాస్టెల్', 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా' వంటి హాలీవుడ్ యానిమేషన్ దిగ్గజాలు కూడా ఉన్నాయి. విజువల్ క్వాలిటీ, నిర్మాణ విలువల్లో కొన్ని ఫ్రేములు హాలీవుడ్ రేంజ్‌ను తలపించినప్పటికీ, తుది ఫలితం ఎలా వస్తుందో చూడాలి.