LOADING...
The Rajasaab : ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్‌పై గందరగోళం.. వాయిదా రూమర్స్‌పై నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్‌పై గందరగోళం.. వాయిదా రూమర్స్‌పై నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్

The Rajasaab : ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్‌పై గందరగోళం.. వాయిదా రూమర్స్‌పై నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి రిలీజ్‌లపై టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా 'అఖండ 2' వాయిదా పడిన తర్వాత, ఈపండుగకు రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రాలపై ఫైనాన్స్ ఇష్యూల ప్రభావం చూపుతోంది. వందల కోట్లతో నిర్మించబడే సినిమాలకు ఫైనాన్స్ క్లియర్ కావడం అత్యంత కీలకం. ఈ విషయంలో చిన్నపాటి సమస్య వచ్చినా, ఏ స్టార్ హీరో సినిమా అయినా రిలీజ్‌కు బ్రేక్ పడటం తప్పదనే వాస్తవం మళ్లీ బయటపడింది. ఈనేపథ్యంలో టాలీవుడ్‌లో మరో వేడి వార్త చక్కర్లు కొడుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' ఈ సంక్రాంతికి రిలీజ్ కాకపోవచ్చన్న ప్రచారం మొదలైంది. బాలీవుడ్‌ కంపెనీకి క్లియర్ చేయాల్సిన ఫైనాన్స్‌ పెండింగ్‌లో ఉండటంతో విడుదల వాయిదా పడుతుందన్న రూమర్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.

Details

ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

జనవరి 9న సంక్రాంతి కానుకగా రానున్న 'రాజాసాబ్' గురించి గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సినిమా విడుదలకు చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 'రాజాసాబ్' మేకింగ్ కోసం తీసుకున్న ఫైనాన్స్‌కు సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా క్లియర్ చేస్తాము. వడ్డీలను కూడా నిర్ణయించిన సమయానికి ముందే చెల్లిస్తామని స్పష్టం చేశారు.

Details

అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాలి

అంతేకాకుండా, ఈ సంక్రాంతికి రానున్న ఇతర చిత్రాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విడుదల కావాలని కోరుతూ మన శంకర వరప్రసాద్, భర్త మహాశయుకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, జన నాయగన్, పరా శక్తి వంటి సినిమాలు కూడా సాఫీగా తమ రిలీజ్‌ను పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అన్ని చిత్రాలు ఘనవిజయం సాధించాలని విశ్వప్రసాద్ ట్వీట్‌లో తెలిపారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాత వ్యాఖ్యలు వైరల్

Advertisement