Shiva Jyothi: తిరుమల ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన శివజ్యోతి
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల ప్రసాదంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వేంకటేశ్వరస్వామి అంటే నాకు ఎంత ఇష్టం ఉందో, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వారికి బాగా తెలుసు. ఏదేమైనా, తప్పు నా వైపు ఉంది. నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. L1 క్యూలో నిలిచిన పరిస్థితిని ఉద్దేశించి మాత్రమే చెప్పాను. నా జీవితాన్ని మార్చిన వేంకటేశ్వరస్వామిపై నేను ఎలా కామెంట్స్ చేయగలను? తెలిసో తెలియకో మాట్లాడినందుకు నా తమ్ముడి తరఫున కూడా సారీ చెబుతున్నానని పేర్కొన్నారు.
Details
ఆగ్రహించిన భక్తులు
తాజాగా కుటుంబంతో కలిసి శివజ్యోతి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. గతంలో ఆమె 'తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే..' అని చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రశ్నల నేపథ్యంలో ఆమె స్పందించారు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్షమాపణ కోరిన శివ జ్యోతి
Sorry 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/LDyEbt9YJT
— Shiva Jyothi (@iamshivajyothi) November 22, 2025