LOADING...
Tere Ishk Mein: ధనుష్‌ కొత్త సినిమాపై వివాదం.. రూ.84 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
ధనుష్‌ కొత్త సినిమాపై వివాదం.. రూ.84 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్

Tere Ishk Mein: ధనుష్‌ కొత్త సినిమాపై వివాదం.. రూ.84 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ధనుష్‌, కృతి సనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం 'తేరే ఇష్క్‌ మే' (తెలుగులో 'అమరకావ్యం') త్వరలో ఓటీటీలోకి రానుంది. గతేడాది నవంబరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే ఓటీటీ రిలీజ్‌కు ముందే ఈ చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈసినిమా తమ సంస్థ నిర్మించిన హిట్‌ మూవీ 'రాంఝనా'కి సీక్వెల్‌లా ప్రచారం చేశారని, కానీ అందుకు తమ అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తూ ఇరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నిర్మాణ సంస్థ కలర్‌ ఎల్లో, దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని,తమ ప్రతిష్ఠకు భంగం కలిగించారని పేర్కొంటూ రూ.84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరింది.

Details

ధనుష్ టీమ్ నేరుగా సంప్రదించాం

అలాగే, 'రాంఝనా'లోని కొన్ని పాత్రలు 'తేరే ఇష్క్‌ మే'లో కొనసాగాయని కూడా ఇరోస్‌ ఆరోపించింది. 'రాంఝనా' కూడా ధనుష్‌, ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ కాంబినేషన్‌లోనే రూపొందింది. 2013లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈచిత్రం, గతేడాది రీ-రిలీజ్‌ అయ్యింది. అయితే ఆరీ-రిలీజ్‌లో విషాదాంతం ఉన్న ముగింపును మార్చడం ద్వారా సినిమా ఆత్మను దెబ్బతీశారంటూ అప్పట్లో ధనుష్‌, ఆనంద్‌ రాయ్‌ ఇరోస్‌పై అసహనం వ్యక్తం చేశారు. రీ-రిలీజ్‌కు ముందు తాము ధనుష్‌ టీమ్‌ను నేరుగా సంప్రదించామని,అప్పట్లో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ఇరోస్‌ సంస్థ స్పష్టం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే 'రాంఝనా' అంశం చుట్టూ మరోసారి వివాదం రాజుకోవడంతో, 'తేరే ఇష్క్‌ మే' ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.

Advertisement