Sarke Chunar: నోరా ఫతేహి పాటపై వివాదం.. లోక్‌సభలో హాట్ డిబేట్
ఈ వార్తాకథనం ఏంటి
నోరా ఫతేహి నటించిన 'సర్కే చునార్ తేరీ సర్కే' పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బుధవారం లోక్‌సభలో కూడా చర్చ జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా ఈ పాటపై వచ్చిన వివాదాన్ని సభలో ప్రస్తావించారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయని, వాటి పరిధిలోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే ఈ పాటపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. ఈ పాట కెడి: ది డెవిల్ సినిమాలో భాగంగా ఉంది. ఈ చిత్రంలో హీరోగా ధ్రువ సర్జా నటిస్తుండగా, సంజయ్ దత్‌తో పాటు నోరా ఫతేహి కూడా కనిపించారు.
Details
ఏప్రిల్ 30న రిలీజ్
తాజాగా విడుదలైన ఈ పాటలోని సాహిత్యం, నృత్యం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ వివాదంపై బాలీవుడ్ గేయ రచయిత రాకీబ్ ఆలం స్పందించారు. దర్శకుడు ప్రేమ్ కన్నడలో రాసిన పాటను చిత్రబృందం అభ్యర్థన మేరకు తాను అనువదించానని తెలిపారు. వివాదం రేగిన తర్వాత కొత్త వెర్షన్ రాయాలని తనను కోరినట్లు కూడా వెల్లడించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.